‘అనంత’మైన ప్రతిభకు ‘కళారత్న ‘ పురస్కారం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పండుగ నాడు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘కళారత్న ‘ పురస్కారం ఈ సంవత్సరం ప్రముఖ ప్లూటు విధ్వాంసుడు తాళ్లూరి నాగరాజు గారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా, అందుకున్నారు. ఈ అవార్డ్ ని ఆయన తన కుటుంబానికి, తల్లి తండ్రులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.
సంగీత కుటుంబం నుంచి వచ్చిన నాగరాజుగారు స్కూల్ రోజుల నుంచీ ప్లూట్ మీద సంగీతం పలికించటంపై ఆసక్తి చూపేవారు. తిరుపతి రామానుజ సూరి గారి శిష్యరికంలో ఆయన కర్ణాటక సంగీతంలో ఓనమాలు దిద్దారు. చిన్నప్పటి నుంచే ప్రదర్శనలు ఇస్తూ వస్తున్న నాగరాజు గారు ఎందరిచేతో సన్మానాలు,సత్కారాలు పొందారు. తన 19 సంవత్సరంలోనే రైల్వే డిపార్టమెంట్ లో కల్చరల్ కోటాలో ఉద్యోగం పొందారు. 
అక్కడ నుంచి ఆయన సంగీత ప్రయాణం అనంతంగా ,అవధులు లేకుండా సాగింది..సాగుతోంది..సాగబోతోంది.  పండిట్ హరిప్రసాద్ చౌరాసియాకు వీరాభిమాని అయిన నాగరాజుగారు..హిందూస్దాని క్లాసికల్ సంగీతం అభ్యసించారు. దేశ,విదేశాల్లో  ఎన్నో మ్యూజిక్ ఈవెంట్స్ లో తన ప్రతిభతో ప్రేక్షకులచే పట్టాభిషేకం చేయించుకున్న నాగరాజుగారు  మన తెలుగువాడు కావటం గర్వకారణం. ఆయనకు తెలుగు 100 శుభాకాంక్షలు తెలియచేస్తోంది. ఆదివారం ఉగాది పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018 ఉగాది పురస్కారాలను ప్రకటించింది. సాహిత్యం, సంగీతం, నాటక రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న 45 మంది కళాకారులకు ‘కళారత్న’ అవార్డులను అందచేసింది. ఈ అవార్డ్ లు అందుకున్న వారిలో ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఎమ్ ఎమ్ శ్రీలేఖ, రామ జోగయ్య శాస్త్రి గారు వంటి సినీ ప్రముఖులు కూడా ఉన్నారు.